Loading...

14, డిసెంబర్ 2012, శుక్రవారం

నంద్యాలలో రాష్ట్ర స్థాయి ఎడ్ల ప్రదర్శన

నంద్యాల: ఒంగోలుజాతి పశు సంపద మన జాతి సంపత్తిగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. అంతరించిపోతున్న ఒంగోలుజాతి పశుసంపదను కాపాడుకోవడం అందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు. నంద్యాలలోని ప్రథమ నంది దేవస్థానం వద్ద రాష్ట్రస్థాయి ఒంగోలుజాతి ఎడ్ల ప్రదర్శనను రాష్ట్ర ఉద్యాన
శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఎమ్మెల్యేలు మురళికృష్ణ, రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఒంగోలుజాతి ఎడ్లు చేరుకున్నాయి. రైతులను ప్రోత్సహించేందుకు పశుసంపదను కాపాడుకొనేందుకు ఏటా ఈ పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే శిల్పా తెలిపారు. వచ్చే ఏడాది మొదటి బహుమతిగా దేశంలోనే అత్యధిక నగదు బహుమతిగా విజేతలైన ఎడ్లకు రూ.మూడు లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.1.50 లక్షలు అందజేస్తామన్నారు.ఐదు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా నంద్యాలకు వచ్చిన సూర్యప్రకాష్‌రెడ్డిని శిల్పా తనయుడు రవిచంద్ర కిశోర్‌రెడ్డి, నందిరైతు సమాఖ్య నాయకులు గజమాలతో సన్మానించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి