Loading...

9, డిసెంబర్ 2012, ఆదివారం

అవినీతి నిర్మూలనే లక్ష్యం: ఆమ్‌ ఆద్మీ

హైదరాబాద్‌: అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన 'ఆమ్‌ ఆద్మీ' (సామాన్య ప్రజల) పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తన రాష్ట్ర శాఖను ఏర్పాటు చేసుకుంది. అవినీతి నిర్మూలనతోపాటు సామాన్యుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంతో తమ పార్టీ పని చేయనుందని వెల్లడించింది. జనవరి లేదా ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో బహిరంగ సభను
ఏర్పాటు చేయనున్నామని, పార్టీ అధినేత కేజ్రీవాల్‌ రానున్నారని తెలిపింది. శనివారం హైదరాబాద్‌లో ఆ పార్టీ పరిశీలకుడు కర్భానీ గవాలి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌గా రంగయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శులుగా మాకినేని నర్సింహరావు, జేవీ సుబ్బారావు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా భాగవతుల మనోహర్‌లను నియమిస్తున్నట్లు గవాలి ప్రకటించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి