టొరంటో: వయసు పెరుగుతున్నకొద్దీ మనుషుల్లో రోగ నిరోధకశక్తి ఆగిపోతుందనటంలో నిజం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోగనిరోధక కణాల్లో ఒకటైన టి కణాలు యువకుల్లో మాదిరిగా వృద్ధుల్లోనూ వైరస్ ఇన్ఫెక్షన్లకు సమర్థవంతంగా ప్రతిస్పందిస్తున్నాయని మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు.
రోగనిరోధక కణాలు లేకపోవటం వల్ల వృద్ధులకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువని చాలా కాలంగా భావిస్తున్నారు. కానీ రోగనిరోధకత అభివృద్ధి చెందే సామర్థ్యం వృద్ధుల్లోనూ ఉంటోందని అధ్యయన నేత జొనాథన్ బ్రామ్సన్ తెలిపారు. వృద్ధులకు టీకా కార్యక్రమాలను అమలు చేసే విషయంలో ఈ ఫలితాల ప్రభావం గణనీయంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి