Loading...

31, డిసెంబర్ 2012, సోమవారం

చంద్రబాబు వైఖరిపై సమైక్యాంధ్ర నేతల నిరసన

విశాఖపట్నం, చైతన్యవారధి: తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తున్నామని సమైక్యాంధ్ర రాజకీయ ఐకాస రాష్ట్రసమన్వయకర్త జేటా రామారావు అన్నారు. ఆదివారం సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రి ఎదుట ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం తెదేపా జిల్లా కార్యాలయానికి చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేశారు.
కార్యాలయానికి టులెట్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. సీమాంధ్రలో తెదేపాకు చోటు లేదని, తక్షణమే కార్యాలయాలను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామన్నారు. సీమాంధ్రలోని అన్ని తెదేపా కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నట్లు చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఐకాస నాయకులు కె.రామచంద్రమూర్తి, బొబ్బాది అప్పారావు, సూరప్పడు, ఎ.వెంకటరావు, ఎంవీఎన్‌ఆర్‌ పట్నాయక్‌, జీవీఎంరెడ్డి, చెక్కా రమాదేవి, రెడ్డిపల్లి నానాజీరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి