హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆన్లైన్ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నెలాఖరులోగా అర్హత పరీక్ష-2013కు నోటిఫికేషన్ జారీ చేయనున్నామని, దీనికి సంబంధించిన దరఖాస్తులను 'ఆన్లైన్' ద్వారా స్వీకరించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉప
కులపతి పి.ప్రకాశ్ తెలిపారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధాకర్, ఏపీ ఆన్లైన్ ముఖ్య నిర్వహణ అధికారి ఎస్ఎస్ రావు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష-2013 దరఖాస్తులు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాల్లో, అన్ని ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను, రూ.235 ఫీజుతో ఏపీ ఆన్లైన్ కేంద్రంలో అందించి పరీక్ష కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి