విశాఖపట్నం, చైతన్యవారధి: సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ బాలబాలికలకు హైదరాబాద్లోని రామంతపుర్, బేగంపేట పబ్లిక్ స్కూలులో 2013-14 విద్యా సంవత్సరం 1వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శాఖ ఉప సంచాలకులు శ్రీనివాసన్ తెలిపారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.18000కి
మించకూడదని, 1-6-2007 నుంచి 31-5-2008 మధ్య పుట్టిన వారే దరఖాస్తు చేసుకోవటానికి అర్హులని తెలిపారు. దరఖాస్తులను ఉపసంచాలకులు, సాంఘిక సంక్షేమశాఖ, ఎం.వి.పి.కాలనీ, విశాఖ-17 అను చిరునామాకు ఈ నెల 15లోగా అందజేయాలని కోరారు. బాలబాలికల పుట్టిన తేదీ సర్టిఫికెట్లు ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ల నుంచి పొంది ఉండాలని తెలిపారు. ఇతర వివరాలకు 0891-2551001 ఫోన్ నెంబరులో సంప్రదించాలని సూచించారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి