Loading...

21, డిసెంబర్ 2012, శుక్రవారం

అనకాపల్లి కోర్టుకు మిలీషియా సభ్యులు

అనకాపల్లి, చైతన్యవారధి: అనకాపల్లి ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జి కోర్టుకు గురువారం ఇద్దరు మిలిషియా సభ్యులను తీసుకువచ్చారు. గత నెలలో జి.కె వీధిలో జి.బాబూరావు, చిన్నారావు, వి. సింహాద్రి, వి. అప్పలరాజు, జి. చంటి, వి. వెంకట్రావు అనే ఆరుగురు మిలీషియా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం కోర్డు
మెజిస్ట్రేట్‌ సెలవు కావడంతో అనకాపల్లి కోర్టుకు వీరిని తీసుకువచ్చారు. వచ్చే నెల రెండో తేదీ వరకు రిమాండు విధిస్తూ ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌జడ్జి ఫణికుమార్‌ తీర్పు వెల్లడించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి