Loading...

13, డిసెంబర్ 2012, గురువారం

శారీరక పెరుగుదలకు.. ఆయుష్షుకూ లంకె!

లండన్‌: చిన్న వయసులో పెరుగుదల కాస్త మందకొడిగా ఉండే వారు ఎక్కువకాలం జీవించే అవకాశాలు అధికమని గ్లాస్గో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. చిన్నవయసులో పెరుగుదల చురుగ్గా ఉంటే సంతోషమేకానీ...ఈ చురుకుదనం వల్ల కణజాలం త్వరగా దెబ్బతింటుందనీ, ఆ ప్రభావం జీవితకాలంపై పడుతుందని వారు విశ్లేషించారు.
కొన్నిరకాల చేపలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైందన్నారు. శారీరక పెరుగుదలలో కనిపించే వేగం కణజాలాన్ని త్వరగా దెబ్బతీస్తుందన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి