కాంట్రాక్టు కార్మికుడి దుర్మరణం
పరవాడ, చైతన్యవారధి: సింహాద్రి జాతీయ థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎన్టీపీసీ) రెండో దశ విస్తరణ పనులు చేపడుతున్న ీసునీల్ హైటెక్' కంపెనీలో బుధవారం జరిగిన ప్రమాదంలో బీహర్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు
ముబారక్ అన్సారీ (30) మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బీహర్‌లోని భుతాని గ్రామానికి చెందిన అన్సారీ కొత్త వెన్నెలపాలెంలో నివసిస్తూ, కొన్నేళ్లుగా సునీల్ హైటెక్‌లో వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. బుధవారం విధులకు వెళ్లిన అన్సారీ నాలుగో యూనిట్ లిఫ్ట్‌కు చెందిన వెల్డింగ్ పనులు 60 మీటర్ల ఎత్తులో చేస్తుండగా కాలు జారడంతో సేఫ్టీ బెల్టు తెగిపోయి కిందపడ్డాడు. తీవ్ర గాయాలై అధిక రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అన్సారీకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే కార్మికులు మృత్యువాత పడుతున్నారని తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాత్రి 7 గంటలకు కేజీహెచ్ వద్ద సునీల్ హైటెక్ కంపెనీ ప్రతినిధి వెంకటేశ్వరరావుతో కార్మిక సంఘం నేతలు రామయ్యనాయుడు, సింహాద్రి హెచ్.ఆర్ అధికారులు డి.ఎస్.కుమార్, కిషోర్ చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం కింద రూ. 6.25 లక్షలు, దహన సంస్కార నిమిత్తం రూ. 50 వేలు చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి