విశాఖపట్నం, చైతన్యవారధి: ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించేందుకు ముసాయిదాను కేబినెట్ ఆమోదించడం హర్షణీయమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు అన్నారు. సీతమ్మధార వీజేఎఫ్ నార్ల వేంకటేశ్వరభవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాన ఉత్పత్తికారకమైన భూమిని ప్రతి దళిత కుటుంబానికి అందేలా సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989ను సమర్ధవంతంగా అమలుచేయాలని, దళితులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు హాస్టల్ వ్యవస్థకు అధిక నిధులు వెచ్చించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ఉప ప్రణాళిక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు ఆర్.నారాయణరావు, వసంత అప్పారావు, ఎన్.నాగమణి, పి.పద్మ, జి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి