Loading...

3, డిసెంబర్ 2012, సోమవారం

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు శాసనసభ ఆమోదం

హైదరాబాద్‌: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. ఆదివారం రాత్రి దాదాపు 11 గంటల దాకా నిరాఘాటంగా సభ జరిగిన నేపథ్యంలో చివరకు బిల్లులోని 12వ క్లాజ్‌ సవరణపై వోటింగ్‌ జరిగి 69-47 వోట్ల తేడాతో సవరణ వీగిపోవటంతో అధికార పక్షం మొత్తం మీద గండం గడిచి
గట్టెక్కింది. అధికార పక్షాన్ని ఇరకాటంలో పడవేసేందుకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసి దాదాపు విజయం సాధించినంత పని చేసింది. సమాధానం, సభ్యుల అభ్యంతరాలు, వాటికి సమాధానాల అనంతరం టీడీపీ నాటకీయంగా బిల్లులోని 12వ క్లాజ్‌కు సవరణను ప్రతిపాదించింది. ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం ఉప ప్రణాళికలో నిధులు కేటాయించాలన్న సవరణను అధికార పక్షం అంగీకరించకపోవటంతో టీడీపీ దీనిపై వోటింగ్‌కు పట్టుపట్టింది. మొదట్లో వైకాపా మినహా మిగిలిన అన్ని విపక్షాలు టీడీపీ డిమాండ్‌కు మద్దతు ప్రకటించాయి. చివరి నిముషంలో వైకాపా సైతం టీడీపీ సవరణకు మద్దతు పలకటంతో అధికార పక్షం కాస్త కంగు తిన్నట్టు కనిపించింది. చివరకు స్పీకర్‌ వోటింగ్‌కు అనుమతించటంతో అసలు కథ ప్రారంభమైంది.

ఏకమైన విపక్షం
తెలుగుదేశం పార్టీ ఉప నాయకుడు అశోక గజపతిరాజు ప్రతిపాదించిన ఈ సవరణకు అనూహ్యంగా అన్ని విపక్షాలు మద్దతు ప్రకటించటంతో అధికార పక్షం కాస్త ఇరకాటంలో పడిపోయింది. సభలో ఉన్న అధికారపక్షం సంఖ్యాబలంపై ఒక దశలో అనుమానాలు తలెత్తాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం సభ్యులు కూడా ఎక్కువమంది లేకపోవటంతో అధికార పక్షం ఊపిరి పీల్చుకోగలిగింది. వోటింగ్‌ జరిగినంతసేపూ సభలో ఉత్కంఠ నెలకొంది. సభ్యులను శాసనసభ సిబ్బంది లెక్కిస్తుండగా వారు ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్ళి కూర్చుంటుండటంతో సంఖ్యపై అయోమయం నెలకొని స్పీకర్‌ మళ్ళీ వోటింగ్‌కు ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమన్వయ లోపం:
అధికార పక్షం విషయానికి వస్తే సమన్వయలోపం స్ప ష్టంగా కనిపించింది. చీఫ్‌విప్‌తో పాటు ఐదుగురు విప్‌లు ఉన్నప్పటికీ, తమ పార్టీ సభ్యులు ఠంచనుగా సభకు హాజరు అయ్యేలా చూడటంలో దారుణంగా విఫలమయ్యారు. అధికార పార్టీ సభ్యులలో చాలామంది శనివారం నాడే తమ నియోజకవర్గాలకు వెళ్ళిపోయారు. ఫలితంగా తగినంత సంఖ్యాబలం ఉంటుం దా లేదా అనే విషయంలో అనుమానాలు ఏర్పడ్డాయి. సభ్యులతో పాటు పలువు రు మంత్రులు కూడా సభకు హాజరు కాలేదు.

ముఖ్యమంత్రి జోక్యం:
మళ్ళీ ఇక్కడ కథ ఒక మలుపు తిరిగింది. వోటింగ్‌ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి లేచి వోటింగ్‌కు అనుమతించే విషయంలో స్పీకర్‌ అధికారాన్ని ప్రశ్నించటం లేదంటూనే సుప్రీంకోర్టు తీర్పును చదివి విని పించారు. సవరణకు వోటింగ్‌కు అనుమతించే విషయంలో స్పీకర్‌ కార్యాల యం ఏబీసీడీ అనే మాటను గమనించినట్టు లేదన్నారు. వర్గీకరణ అనేది ప్రస్తు తం లేనే లేదని, సవరణను ఆమోదిస్తే రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందని చెప్పి కూర్చున్నారు.

బిల్లులో పొరపాటున ఏబీసీడీ అని ప్రచురితమైందని, వెంటనే టీడీపీ ఉపనాయకుడు అశోకగజపతిరాజు లేచి తాము బిల్లును వ్యతిరేకించటం లేదని, అయితే సమాజంలో పూర్తి అట్టడుగున ఉన్న వారి కోసమే సవరణ ప్రతిపాదించామని, ఈ దశలో ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించి సమస్యను సంక్లిష్టం చేశారని వ్యాఖ్యానించారు. దీనిపై అభిప్రాయం తెలుసుకో వటానికి అడ్వకేట్‌ జనరల్‌ను సభకు పిలిపించాలని రాజు డిమాండ్‌ చేశారు. పరిస్థితిలో ప్రతిష్టంభన ఏర్పడటంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై స్పీకర్‌ అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు కోరారు. మజ్లిస్‌ పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అడ్వకేట్‌ జనరల్‌ను పిలిపించాలని కోరగా, మిగిలి న వారు మాత్రం స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని తెలిపారు.

ఉప కులాల కోసమే:
అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలలోని ఉప కులాల అభ్యు న్నతి కోసమే బిల్లు తీసుకు వస్తున్నామని ముసాయిదాలో స్పష్టంగా తెలిపా మన్నారు. ఎస్సీ వర్గీకరణ వీలు కానందువల్లనే అతి స్పష్టంగా ఈ అంశాన్ని పేర్కొన్నామన్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో 59 ఉప కులాలకు, ఎస్టీ సామా జిక వర్గంలో ఉన్న ఉప కులాలకు మేలు కలిగే విధంగానే బిల్లును జాగ్రత్తగా రూపొందించామని స్పష్టం చేశారు.

చివరకు ఫలితం ప్రకటన:
ఈ దశలో ఇక లాభం లేదనుకున్న స్పీకర్‌ నాదెం డ్ల మనోహర్‌ వోటింగ్‌ ఫలితాన్ని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే లెక్కింపు పూర్తి కావటంతో సవరణకు వ్యతిరేకంగా 69, అనుకూలంగా 4 ఓట్లు వచ్చినట్టు ప్రకటించారు. ఆ తర్వాత వివిధ క్లాజులకు విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు కూడా వీగిపోయినట్టు స్పీకర్‌ ప్రకటించి సభను నిరవధిక వాయిదా వేసి వెళ్ళిపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి