Loading...

30, డిసెంబర్ 2012, ఆదివారం

ఆర్‌ఈసీఎస్‌ నూతన ఛైర్మన్‌గా నేడు చల్లా ప్రమాణస్వీకారం

కశింకోట, చైతన్యవారధి: అనకాపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ నూతన ఛైర్మన్‌గా పరవాడ ప్రాంత డైరెక్టరు, ప్రస్తుత వైఎస్‌ ఛైర్మన్‌ చల్లా కనకారావు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. వైస్‌ ఛైర్మన్‌గా గొల్లవిల్లి శ్రీనివాసరావు పదవీ బాధ్యతలు చేపడతారు. 2010 మార్చిలో జరిగిన ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం
బోడ్డేడ ప్రసాద్‌ పదవీకాలం రెండున్నర ఏళ్లు పూర్తవ్వడంతో ఛైర్మన్‌ పదవికి ఆయన చేసిన రాజీనామాను డివిజనల్‌ కోఆపరేటివ్‌ అధికారి శనివారం ఆమోదించారు. దీంతో ఆదివారం పాలకవర్గం కొత్త ఛైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకోనుంది. ఆ వెంటనే సంస్థ ప్రధాన కార్యాలయంలో వీనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో వినియోగదారులకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత తమ పాలకవర్గానికే దక్కిందని మాజీ ఛైర్మన్‌ బోడ్డేడ ప్రసాద్‌ అన్నారు. స్థానిక విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ సంస్థ కేవలం రూ. 22 లక్షల లాభాలతో ఉన్నప్పుడు తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిందని, ప్రస్తుతం రూ. ఆరు కోట్ల లాభాలతో ఉందన్నారు. ఇందిర కరుణ తరంగిణి పథకం కింద వినియోగదారులకు రూ.2.20కోట్లు అందించామన్నారు. సంస్థలో సుదీర్ఘకాలం ఛైర్మన్‌గా కొనసాగిన ఘనత తనకే దక్కిందని తెలిపారు. ఈ సమావేశంలో చల్లా కనకారావు గొల్లవిల్లి శ్రీనివాసరావు, పెంటకోట శ్రీనివాసరావు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గోన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి