ఇస్లామాబాద్ : భారత్‌లో పాక్ క్రికెట్ టూర్‌పై ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఇషాన్ మనీ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌లో వన్డే సిరీస్‌లు ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంగీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. క్రికెట్ పర్యటన పాక్ రాజకీయ నిర్ణయమే అయితే.. భారత్ కూడా ఇక్కడికి వచ్చి పాకిస్థాన్‌తో ఆడాలని పీసీబీ అడిగి ఉండాల్సిందని
ఇషాన్ పాక్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. భారత్‌లో పాక్ పర్యటించకూడదని తన అభిప్రాయమన్నారు. ముంబయి దాడుల అనంతరం పాక్‌తో తటస్థ వేదికలపై కూడా క్రికెట్ ఆడటానికి బీసీసీఐ నిరాకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి