Loading...

31, డిసెంబర్ 2012, సోమవారం

ఆర్‌ఈసీఎస్ నూతన చైర్మన్‌గా చల్లా కనకారావు పదవీ బాధ్యతలు

కశింకోట, చైతన్యవారధి: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిల సమక్షంలో ఆర్‌ఈసీఎస్ నూతన చైర్మన్‌గా చల్లా కనకారావు ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పరవాడ సెగ్మెంట్ డెరైక్టర్‌గా కొనసాగుతున్న కనకరావును చైర్మన్‌గా పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆయన పేరును బొడ్డేడ ప్రసాద్
ప్రతిపాదించగా, తాళ్లపాలెం సెగ్మెంట్ డెరైక్టర్ గొల్లవిల్లి శ్రీనివాసరావు బలపర్చారు. చైర్మన్‌గా కనకారావు, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు మినిట్ పుస్తకంలో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. వీరిని వైఎస్సార్ సీపీ నేతలు కొణతాల రామకృష్ణ, గండి బాబ్జి, కొణతాల లక్ష్మీనారాయణరావు(పెదబాబు), ఎమ్‌డీ శ్రీనివాసరావు, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, మద్దతుదారులు అభినందించారు.
ఆర్‌ఈసీఎస్ అభివృద్ధికి మరింత కృషి చేయాలి: ఆర్‌ఈసీఎస్‌ను మరింతగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్ సీపీ నేత కొణతాల రామకృష్ణ ఆకాంక్షించారు. సంస్థ ప్రధాన కార్యాలయం లో ఆదివారం నూతన చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్థ వ్యవస్థాపక చైర్మన్ దివంగత పీవీ రమణ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆర్‌ఈసీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ 2013 డైరీని కొణతాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పాలకవర్గం ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎన్నికల సమయంలో నిర్ణయం మేరకు చైర్మన్‌గా కనకారావు బాధ్యతలు చేపట్టారన్నారు. ఇప్పటివరకు చైర్మన్‌గా కొనసాగిన బొడ్డేడ ప్రసాద్ సేవలు సంస్థకు అవసరమన్నారు. డెరైక్టర్లు పెంటకోట శ్రీనివాసరావు, దొడ్డి శ్రీనివాసరావు, సబ్బవరపు నారాయణమూర్తి, సేనాపతి గంగునాయుడు, కాపుశెట్టి శేషుబాబు, అనకాపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మలసాల కిషోర్,వైస్ చైర్మన్ కన్నూరి వెంకటరమణ, పెందుర్తి వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి గండి రవికుమార్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు సంజీవరావు, దొడ్డి ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ మళ్ల బుల్లిబాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు రాపేటి భాను, పరవాడ వైఎస్సార్ సీపీ నేతలు కాసు అంజి రెడ్డి, పైల గోపాలకృష్ణ, షేక్ ఇస్మాయిల్, చుక్క రామునాయుడు, లాలం ఈశ్వరరావు, గొంది నూకరాజు, డెక్క శ్రీనివాసరావు, బొండా కనకారావు, గొర్లి ఎరుకునాయుడు, పైల అప్పలనాయుడు (జూనియర్) పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పరవాడ నుంచి మద్దతుదారులతో కనకారావు ఊరేగింపుగా సంస్థ కార్యాలయానికి విచ్చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి