Loading...

2, డిసెంబర్ 2012, ఆదివారం

లక్ష నారికేళాలతో..అర్ధనారీశ్వరునికి మహా నివేదన!

తొండంగి: పరమశివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర సందర్భంగా శనివారం తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో కొలువైన రామలింగేశ్వరుని ఆలయంలో లక్ష నారికేళ విచ్ఛేదన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు సమర్పించిన లక్ష కొబ్బరికాయలను గుడి ముందు గుట్టగా పోయగా.. అక్కడ ఏర్పాటు చేసిన మండపంలో భక్తులు
వాటిని కొట్టారు. వీటి నుంచి వచ్చిన కొబ్బరి నీళ్లు గర్భగుడిలోని శివలింగాన్ని అభిషేకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి