ఢిల్లీ ఘటనపై గళమెత్తిన మహిళాలోకం
ఆర్కేబీచ్లో భారీ ప్రదర్శనలు
విశాఖపట్నం రూరల్, చైతన్యవారధి: దేశ రాజధాని ఢిల్లీలో యువతిపై అత్యాచారం ఘటనను నగర మహిళాలోకం తీవ్రంగా ఖండించింది. సంఘటనను నిరసిస్తూ నగరంలోని పలు కళాశాలల విద్యార్థినులు, స్వచ్ఛంద సంస్థల
ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కేబీచ్లో భారీ ర్యాలీలు జరిగాయి. అవంతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నగరంలోని పలు కళాశాల విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీ ఆర్కేబీచ్ వైఎంసీఏ నుంచి కాళీమాత ఆలయం వరకు సాగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ ఢిల్లీ ఘటన యావత్ భారతవని తలదించుకోవాల్సిన అంశమన్నారు. ఈ సంఘటనకు కారణమైన వారిని ప్రభుత్వం శిక్షించకుండా ఉపేక్షించడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా నిందితులను ఉరి తీయాలన్నారు. బ్లూ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బీచ్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రవితేజ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి తరుణ్ శ్రీరామ్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి