గాజువాక, చైతన్యవారధి: అంతర జిల్లా రోలర్ హాకీ టోర్నీ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను విశాఖ జట్టు దక్కించుకుంది. ఉక్కునగరం ఇందిరాపార్కులో నవంబరు 29 నుంచి జరుగుతున్న పోటీలు ఆదివారంతో ముగిశాయి. అన్ని విభాగాల్లోనూ విశాఖ జట్లు సత్తా చాటాయి. ఘన విజయాలు నమోదు చేశాయి. సాయంత్రం ఏర్పాటుచేసిన
ముగింపోత్సవానికి ఉక్కు డైరెక్టర్ (ఫైనాన్స్) పి.మధుసూదన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. టోర్నీ నిర్వహణ తీరు బాగుందని గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ ప్రశంసించారు. అనంతరం విజేతలకు అతిథుల చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉక్కు అధికారులు డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, పి.సి.మహాపాత్ర, మాధవరావు, ఎం.ఎస్.కుమార్, క్రాంతికుమార్, ఉక్కునగరం రోలర్ స్కేటింగ్ సంఘం ప్రతినిదులు భాస్కర్‌నాయుడు, రమణారావు, బోసుబాబు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి