-కాపునాడు ఫిక్ నిక్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు
ఆనందపురం, చైతన్యవారధి: కాపు కులస్థులను బీసీలుగా గుర్తించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం నగర కాపునాడు ఆధ్వర్యంలో గంటాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాపులు ఏ పార్టీకి మద్దతిస్తే వారికి విజయం తథ్యమన్నారు.
అనంతరం పోతిన మల్లయ్యపాలెం సాంకేతిక విద్యా పరిషత్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాలకు ఆయన హాజరయ్యారు. భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ఎం.శ్రీనివాసరావు పి.రమేశ్‌బాబు, ప్రేమా ఆసుపత్రి అధినేత ఎస్.వి.ఆదినారాయణ, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ శివశంకర్, అధ్యక్షుడు గుంటూరు వెంకట నర్సింహారావు, కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ ఎస్.వి.హెచ్.రవీంద్ర, భాజపా నాయకులు బి.రంగమోహన్, ఎం.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి