Loading...

20, డిసెంబర్ 2012, గురువారం

ఉపకారవేతనం, బోధనాఫీజుల దరఖాస్తు గడువు పొడిగింపు

 హైదరాబాద్‌: పేద విద్యార్థులు ఉపకారవేతనం, బోధనాఫీజులు పొందడానికి దరఖాస్తు గడువును ఈనెల 31 వరకు పెంచుతూ ప్రభుత్వ సంక్షేమ శాఖలు నిర్ణయం తీసుకున్నాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు మైనారిటీ కార్పొరేషన్‌ ఎండీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తప్పకుండా
'మీసేవ' నుంచి పొందిన కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు మాత్రమే దరఖాస్తులకు జత చేయాలని అధికారులు జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దరఖాస్తు గడువు ముగిసే నాటికి 'మీసేవ' పత్రాలు రాకపోయినా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తిచేసి, పత్రాలు జారీ అయిన తర్వాత జత చేయాలని సూచించారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి