చైతన్యవారధి: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగి ఆరాధ్యదైవంగా అవతరించిన సచిన్ వన్డే పరుగుకు ముగింపు కోరాడు. భారత మాత ముద్దుబిడ్డ సచిన్ ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఫుల్స్టాప్ పెట్టాడు. పాకిస్తాన్‌తో వన్డే సీరీస్ ఆడుతాడనుకున్న సచిన్ ఆ సీరీస్‌కు జట్టు ఎంపిక సమయానికి ముందే బిసిసిఐకి లేఖ ద్వారా తన నిర్ణయాన్ని తెలిపాడు. సచిన్ అభ్యర్థనను బిసిసిఐ కూడా అంగీకరించింది. లేఖ అందుకున్న బిసిసిఐ వర్గాలు ఈ విషయాన్ని మీడియాకు తెలిపాయి. సచిన్ రాసిన లేఖలో భారత క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, 2015లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు మళ్లీ ప్రపంచ కప్
టైటిల్ సాధించాలని ఆకాంక్షించాడు. ఆ దిశగా భారత క్రికెట్ జట్టు సమాయత్తం కావల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్న సచిన్ అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అందులో భాగంగానే తన కెరీర్ ఎదుగుదలకు సహకరించిన బిసిసిఐకి, క్రికెట్ సభ్యులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు సచిన్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు తాను ప్రాతినిథ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డాడు. ఇంకా టెస్ట్ ఫార్మాట్లో కొనసాగుతానని పేర్కొన్న సచిన్ గత కొంత కాలంగా సుదీర్ఘంగా సాగుతున్న చర్చకు బ్రేక్ వేశాడు. ఎలాంటి విమర్శకైనా ఎప్పుడూ చేతలతోనే సమాదానం చెప్పే సచిన్ తన కెరీర్ ముగింపు విషయంలో కూడా అదే చేశాడు. ప్రపంచ కప్ తర్వాత వరుసగా విఫలమవుతున్న సచిన్ ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని కొంతమంది చేసిన విమర్శలపై ఏ మాత్రం నోరు పారేసుకోకుండానే తనదైన శైలిలో ఆదివారం నాడు చేతలతోనే సమాదానం ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సీరీస్‌లో రాణించలేక పోయిన సచిన్ పాకిస్తాన్‌తోనూ వన్డే సీరీస్‌కు అందుబాటులోనే ఉన్నానని ప్రకటించిన నేపథ్యంలో సచిన్‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవచ్చునని వచ్చిన ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటికీ భిన్నంగా సచిన్ మరో విధంగా సమాదానం చెప్పాడు.పదహారు సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ రెండు దశాబ్ధాల పాటు క్రికెట్‌ను ఏలిపారేశాడు.1989లో తన తొలి మ్యాచ్‌ని చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో అక్కడి గుజరన్వాలా మైదానంలో డిసెంబర్ 18న ప్రారంభిచిన సచిన్ చివరి మ్యాచ్ కూడా పాకిస్తాన్‌తోనే మార్చి 18, 2012న బంగ్లాదేశ్‌లోని మిర్పూర్ మైదానంలో ముగించాడు. తొలి నాళ్లలో మరీ పిన్న వయస్కుడు కావడంతో పాక్, ఆసీస్ దిగ్గజ బౌలర్లైన వకార్ యూనిస్, వసీం అక్రం, షేర్న్వార్న్ వంటి వారిని ఎదుర్కొనడానికి భయపడ్డ సచిన్ కొంత కాలానికి నెమ్మదిగా కోలుకొని వారికే చుక్కలు చూపించాడు.
ప్రపంచ బ్యాట్స్‌మెన్ అందరినీ బెంబేలెత్తించే ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేర్న్ వార్న్‌కు సచిన్ తన బ్యాట్‌తో నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. జట్టు ఏదైనా.. వేదిక ఎక్కడైనా క్రీజ్‌లోకి వచ్చాడంటే పరుగుల వరద పారించడమే లక్ష్యంగా చేసుకే సచిన్ క్రికెట్ చరిత్రలో ఉన్న అన్ని రికార్డులనూ తిరగ రాశాడు.ఇటు వన్డేలు, అటు టెస్టులు.. ఏ ఫార్మాట్ చరిచి చూసినా రికార్డులన్నీంటీలోనూ సచిన్ పేరే ముందు కన్పించే విధంగా తన ముద్రను వేసుకున్న సచిన్ అత్యధిక శతకాలు, అత్యధిక పరుగులు, అత్యధిక వన్డే మ్యాచ్‌లు, అత్యుత్తమ స్కోర్లూ తన పేరుతోనే రాసుకున్న లిటిల్ మాస్టర్ వన్డే చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని డబుల్ శతకాన్ని కూడా అధిగమించాడు.
మొత్తంగా 463 వన్డే మ్యాచ్‌ల్లో ఆడిన సచిన్ 18426 పరుగులు చేసి 44.83 సగటును నమోదు చేశాడు. వన్డేల్లో 49 శతకాలు సాధించిన సచిన్ టెస్ట్‌ల్లో 51 శతకాలు సాధించి శతకాల శతకాన్ని కూడా రచించాడు. అంతే కాదండోయ్ ఒక్క బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కీలక సమయాలలో బౌలింగ్‌కు దిగి ఆపదలో ఉన్న జట్టుకు అండగా నిలిచిన సచిన్ తన కెరీర్లో 154 వికెట్లను కూడా పడగొట్టాడు. ఇప్పటి వరకు (ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సీరీస్‌తో పాటు) 188 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్ 55.44 సగటుతో 15470 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో ప్రపంచంలోనే ఏ ఇతర క్రికెటర్ చేయలేన్ని 51 శతకాలు, 65 అర్ధ శతకాలు సాధించిన మాన మాస్టర్ టెస్టుల్లోనూ 45 వికెట్లు పడగొట్టాడు. ఇంత చేసిన మన మాస్టర్ బ్లాస్టర్‌కు చాలా కాలం వరకు ఓ వెలితి కూడా ఉండేది.
అదే తాను ప్రాతినిథ్యం వహించే జట్టుకు ప్రపంచ కప్ సాధించిపెట్టలేకపోయాననే లోటు వేధించేది. అది కూడా గతేడాది ధోనీ నేతృత్వంలోని భారత జట్టు స్వాదీనం చేసుకోవడంతో ఇక చాలనుకున్నాడు. కానీ పొట్టి క్రికెట్‌గా అనతి కాలంలోనే ప్రపంచ స్థాయి అత్యధిక అభిమానుల ఆధరాభిమానాలు చూరగొన్న టీ20 ఫార్మాట్‌కు సచిన్ దాదాపుగా దూరంగా వస్తూ వచ్చాడు. కానీ అంతర్జాతీయ టీ20లకు యువకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చిన సచిన్ ఆ ముచ్చటను ఐపిఎల్‌లో ముంబై ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించి తీర్చుకున్నాడు. అయితే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత సచిన్ కెరీర్ ఓ మలుపు తిరిగింది. క్రికెట్లో తాను సాధించాల్సింది ఇంకా ఏమీ లేదనుకున్న సచిన్ ప్రత్యేకంగా ఎంచుకున్న కొన్ని సీరీస్లలోనే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన సచిన్ అందులోనూ పెద్దగా రాణించలేకపోయాడు. అప్పటికే వయస్సు మీదపడడం.
రోజురోజుకూ జాతీయ జట్టుకు యువకుల తాకిడి పెరగడం వంటి పరిణామాలు సచిన్ రిటైర్మెంట్పై విమర్శలకు దారి తీసింది. అవకాశం లభించినప్పుడల్లా అవసరమున్నా.. లేకున్నా.. కొందరు ప్రత్యేకించి సచిన్ రిటైర్మెంట్ అంశాన్ని తెరపైకి తెస్తు నలుగురి నోళ్లలో నాంచేలా చేశారు. అది కాస్త సచిన్ క్రికెట్‌పై తీవ్ర ఒత్తిడికి దారి తీసింది. లేటు వయస్సులోను అభినవ యువకునిలా రెచ్చిపోయే చిచ్చర పిడుగు ముఖ్య మైన మ్యాచ్‌ల్లో తీవ్ర ఒత్తిడి లోనయ్యో వాడు. ఇలా గత ప్రపంచ కప్ ముగిసినప్పటి నుంచి అనుకున్నంత మేర రాణించలేకపోయిన సచిన్‌పై ఇంగ్లాండ్ సీరీస్‌కు ముందు కూడా బాగానే ఒత్తిడి పెరిగింది. కానీ స్వదేశంలో ఆడిన సీరీస్‌కు సచిన్ ప్రాతినిథ్యం ఎంతో అవసరమని భావించిన సెలెక్టర్లు సచిన్‌ను టెస్ట్‌లకు ఎంపిక చేశారు కూడా.. కానీ అప్పటి నుంచి కొనసాగుతున్న విమర్శల పర్వం సచిన్‌ను కోలుకోకుండా చేశాయి.
అదే పరిస్థితి పాక్ సీరీస్‌కు ముందు కూడా తలెత్తడంతో ఆదివారం నాడు సచిన్ తనదైన శైలిలో అన్ని ప్రశ్నలకు ఒకే సమాదానంగా నేను వన్డేల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. ఈ నిర్ణయానికి కొందరు విస్మయం వ్యక్తం చేసినా ఎక్కువ మంది స్వాగతించారు. ఎంతటి దిగ్గజమైనా ఏదో ఓ రోజు నిష్ర్కమించాల్సిందేనని.. కానీ సచిన్‌లాంటి ఐకాన్ తప్పుకోవడం కొంత బాదాగానే ఉందని మరికొందరు తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి