వైకాపా నేత కొణతాల రామకృష్ణ
రావికమతం, చైతన్యవారధి: వైద్యనాథ్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ సహకార చట్టం ప్రకారం సహకార ఎన్నికలు నిర్వహించాలని వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ డిమాండు చేశారు. అనకాపల్లిలో తన కార్యాలయంలో బుధవారం గ్రామీణ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన
వైకాపా నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైద్యనాథ్ కమిటీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందన్నారు. దీని ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి సహకార సంఘ ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్ డైరక్టర్లకు ఓటు హక్కు ఉండదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగాలన్న నిబంధనలు ఉన్నాయన్నారు. ఈ చట్టంపై ఫిబ్రవరి 13లోగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించాల్సి ఉందని, లేకుంటే ఫిబ్రవరి 14 నుంచి జాతీయ సహకార చట్టం యధావిధిగా అమలవుతుందని చెప్పారు. ఈ చట్టం అమలైతే కాంగ్రెస్ నాయకత్వం ఆటలు సాగవని, దొడ్డిదారిన పదవులు పొందడానికి హడావుడిగా సహకార ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఎమ్మెల్యే, మంత్రుల వద్ద అధికారాలు ఉంచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో ఆర్ఈసీఎస్ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాదు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మలసాల కిశోర్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మళ్ల సంజీవరావు, వైకాపా పట్టణ కన్వీనర్ మందపాటి జానకీరామరాజు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి