చర్యలకు ఏయూ ఉద్యోగ, విద్యార్థి సంఘాల డిమాండ్
విశాఖపట్నం, చైతన్యవారధి: ఏయూ దూరవిద్య అర్థశాస్త్ర విభాగాచార్యుడు రామునాయుడిపై వర్సిటీ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఏయూ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. యువతితో శృంగార కార్యకలాపాలు సాగించినట్లు మీడియాలో కథనాలు వెలువడటం ఏయూలో కలకలం రేపింది.
దీంతో శుక్రవారం ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఉత్కంఠ వాతావరణం కనిపించింది. ఈ వ్యవహారాన్ని ఏయూ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా ఏయూ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు బొట్ట రామచందర్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఏయూలో చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. దీనిపై వర్సిటీ వర్గాలు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని సూచించారు. ఆచార్య రామునాయుడిపై అభియోగం రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు టీఎన్ఎఫ్, ఎండీఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు సైతం ఈ వ్యవహారంపై త్వరిత గతిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏయూలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి