గాజువాక, చైతన్యవారధి: ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 6 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీల్లో పాల్గొనే విశాఖ జిల్లా జట్టును బీహెచ్‌పీవీ క్రీడామైదానంలో ఆదివారం ఎంపికచేశారు. ఇరవై రోజుల క్రితం 30 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. శిక్షణ అనంతరం వారు చూపిన ప్రతిభ ఆధారంగా తుది జట్టును
ఎంపికచేసినట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. బి.శ్రీనివాస్, కె.సూరిబాబు, కె.రాజుబాబు, వై.దుర్గాప్రసాద్, కె.రవికుమార్, బి.నూకరాజు, టి.అప్పారావు, పి.రవి, పి.ప్రసాద్, కె.వెంకటరావు, బి.కృష్ణ, టి.రాజు, కె.సురేష్, ఎం.వెంకునాయుడు జట్టులో స్థానం సంపాదించారు. కోచ్‌లుగా బి.నరసింహనాయుడు, ఎన్.మంగరాజు, మేనేజర్‌గా వి.కనకరాజు వ్యవహరిస్తారని చెప్పారు. బాలికల జట్టును సోమవారం ఎంపికచేస్తామని వెల్లడించారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి