Loading...

3, డిసెంబర్ 2012, సోమవారం

తాండవకు సందర్శకుల తాకిడి

నాతవరం, చైతన్యవారధి: సుందరమైన తాండవ జలాశయ సమీపంలో సేదతీరేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధికంగా వస్తున్నారు. ఆదివారం ఈ ప్రాంతమంతా వీరితో సందడిగా మారింది. ప్రస్తుతం జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నందున అందరినీ ఆకట్టుకుంటోంది. సందర్శకులు జలశయాన్ని చూసి
ముగ్ధులవుతున్నారు. నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ఇక్కడే వంటలు ఏర్పాటు చేసి సాయంత్రం వరకు కలియదిరిగారు. ఇక్కడ వంటలు చేసుకునేందుకు, ఇతర ప్రాంతీయులు గడిపేందుకు వీలుగా సిమెంటు రేకులతో మరో నిర్మాణం చేస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి