చెన్నై తెలుగు సంఘాల తీర్మానం
చెన్నై: 'ఆంధ్రాభవన్' కోసం తమిళనాడు ప్రభుత్వం ఇటీవల నగర శివార్లలో కేటాయించిన 1100 చదరపు మీటర్ల స్థలం చాలదని ఎకరం స్థలాన్ని కేటాయించే విషయాన్ని పునరాలోచించాలని చెన్నైలోని తెలుగు సంఘాలు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ అంశంపై శుక్రవారం ఆంధ్ర సామాజిక సాంస్కృతిక సంఘం(ఆస్కా), అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశాయి. శివార్లలో
కాక నగరంలోని ప్రముఖ కూడళ్లలో ఎకరం స్థలాన్ని కేటాయించాలని తీర్మానం చేశాయి. నగరంలో పెద్దసంఖ్యలో ఉన్న తెలుగువారి భూములు ప్రస్తుతం కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయని, కనీసం వాటిలో నుంచైనా తమకు జాగా కేటాయించాలని సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు. స్థలాన్ని కేటాయిస్తే అందులో భవనాన్ని తామే నిర్మించుకుంటామని కెన్సెస్ సంస్థ ఛైర్మన్ కె.నర్సారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆస్కా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఏఐటీఎఫ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి