లండన్: మహిళల కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కొత్తరకం కండోమ్‌ని రూపొందించారు. వాడిన తర్వాత శరీరంలోనే కరిగిపోవటం దీని ప్రత్యేకత. పైగా ఇందులో హెచ్ఐవీని అడ్డుకునే మందులు, గర్భనిరోధక హార్మోన్లూ ఉంటాయి. అందువల్ల ఇది వీర్యకణాలను అడ్డుకోవటమే కాదు. రసాయనాలను విడుదల చేస్తూ
గర్భనిరోధక సాధనంగానూ పనిచేస్తుంది. లైంగిక సంపర్కం ద్వారా సోకే హెచ్ఐవీ వంటి జబ్బుల నుంచీ కాపాడుతుంది. ఎలక్ట్రోస్పిన్నింగ్ పద్ధతి ద్వారా అతిసూక్ష్మమైన పోగులను (ఫైబర్లు) ఉపయోగించి ఈ కండోమ్‌ని సృష్టించారు. అతి పలుచగా ఉండే దీని పొరల్లో మందులను కూడా కూర్చొచ్చు. వాడిన తర్వాత కొన్ని నిమిషాల్లోనో కొన్నిరోజుల తర్వాతో కరిగిపోయేలా వీటిని తయారుచేశారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి