గోల్డెన్ ట్రయాంగిల్: కొత్తక వింత పాతొక రోత అన్నట్లుగా థాయ్‌లాండ్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్లో ఏనుగుల మలం నుంచి ఖరీదైన కాఫీని తయారుచేస్తున్నారు. ఒక కప్పు కాఫీని 50 డాలర్లకు (దాదాపు రూ.మూడు వేలకు) విక్రయిస్తున్నారు. కేవలం థాయ్లాండ్లోనే కాదు.. మాల్దీవులు, అబుదాబీ తదితర దేశాల్లోని ఖరీదైన
హోటళ్లలోనూ ఈ కాఫీ రుచి చూపిస్తున్నారు. ఇంతకూ ఈ ఖరీదైన కాఫీ తయారయ్యేదెలా అంటే.. ఏనుగులు ఆహారంగా తీసుకునే చెరుకు గడలు, అరటిపండ్లు వంటి వాటికి కాఫీగింజలను అతికించి వాటితో తినిపిస్తున్నారు. మరుసటిరోజు ఏనుగు విసర్జించినప్పుడు మలంలోంచి ఆ గింజలను సేకరించి వాటిద్వారా కాఫీ తయారుచేస్తున్నారు. దీనికి 'బ్లాక్ ఐవరీ కాఫీ' అనే పేరు కూడా పెట్టారు. ఇది చాలా సాఫీగా ఉంటుందని, మామూలు కాఫీలో ఉండే చేదు దీంట్లో మచ్చుకైనా ఉండదని.. దీనివల్లే బ్లాక్ఐవరీకి అద్వితీయమైన రుచి వస్తోందని తయారీదార్లు చెబుతున్నారు. ఏనుగు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు కాఫీగింజల్లో చేదుకు కారణమయ్యే ప్రోటీన్లను విడగొడుతుంటాయని, దీనివల్లే చేదు మాయమవుతుందని వారు పేర్కొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి