కాంగ్రెస్ బడుగు, బలహీనులపార్టీ: వీహెచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపాలోకి వెళ్తున్నవారంతా అగ్రవర్ణాలకు చెందిన వారేనని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. తొలి నుంచి కాంగ్రెస్తో ఉన్నది బడుగు, బలహీనవర్గాలేనని చెప్పారు. ఇప్పుడూ వారే పార్టీకి అండగా నిలబడ్డారని వ్యాఖ్యానించారు. శనివారమిక్కడ వీహెచ్ తన నివాసంలో విలేకరులతో
మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించినట్లుగానే మైనారిటీ, బీసీలకూ ప్రత్యేక చట్టబద్ధ ఉప ప్రణాళిక తేవాలని సూచించారు. మంత్రివర్గ నిర్ణయాలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వీహెచ్ తప్పుబట్టారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి