జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం డిమాండ్
హైదరాబాద్ : అటవీశాఖలో ఉన్నతస్థాయి పోస్టులు అదనంగా భర్తీ చేస్తున్నారని, అడవిని కాపాడాల్సిన సిబ్బంది నియామకం మాత్రం జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. 1965లో నియమితులైన బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ (బీఎఫ్ఓ) పోస్టులు ఖాళీ అవుతున్నా.. ఆ స్థానంలో నియామకాలు
జరగకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.నాగేందర్బాబు, ఇ.శ్రీనివాసులు ఆదివారం పేర్కొన్నారు. వీటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు, భత్యాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలపై అటవీశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి