అనకాపల్లి, చైతన్యవారధి: పోలీస్ వ్యవస్థ స్థాపించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదనపు డీఐజీ (క్రీడలు) రాజీవ్ త్రివేది చేపట్టిన సైకిల్‌యాత్రకు ఘన స్వాగతం లభించింది. విశాఖలో బయలుదేరిన ఈ సైకిల్‌యాత్ర ఆదివారం ఉదయం అనకాపల్లి చేరుకుంది. మండలంలోని మారేడుపూడి జాతీయ రహదారికి యాత్ర చేరుకోగానే స్థానిక
పోలీసులు ఇక్కడికి చేరుకుని పెద్దఎత్తున స్వాగతం పలికారు. మార్గ మధ్యలో ఎన్సీసీ క్యాడెట్లు, క్రీడాకారులు రాజీవ్ త్రివేదికి స్వాగతం పలికారు. ఈ సైకిల్‌యాత్రలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. తొలి రోజు 40 కిలోమీటర్లు సాగిన యాత్ర అనకాపల్లిలో ఆగింది. ఇక్కడ పోలీస్ అతిధి గృహంలో రాజీవ్ త్రివేది బృందం విశ్రాంతి తీసుకుని సోమవారం ఉదయం బయలుదేరుతారు.
పోలీసులపై విశ్వాసం నింపేందుకే.
ప్రజల్లో పోలీసులంటే ఉన్న భయం పారదోలి విశ్వాసం నింపేందుకే డీజీపీ దినేష్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ యాత్ర చేపట్టినట్లు అదనపు డీజీపీ రాజీవ్‌త్రివేది తెలిపారు. అనకాపల్లి జాతీయ రహదారి వద్దకు చేరుకున్న ఆయన ఇక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనకాపల్లిలో ఎన్సీసీ విద్యార్థులు, క్రీడాకారులు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేయడానికి చురుకైన యువత అవసరమని ఆ చురుకుతనం వ్యాయామంతో వస్తుందని ఆయన చెప్పారు. చదువు సహా క్రీడలపై విద్యార్థులు ఆసక్తి చూపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి.శ్రీనివాస్, మహారాష్ట్ర డీఎస్పీ బాల సాహెబ్, అదనపు ఎస్పీ నందకిశోర్, ఏఎస్పీ ఇక్బాల్, విశాఖ ఏడీసీపీ మహ్మద్ ఖాన్, డీఎస్పీ షకీలాబాను, సీఐలు గోవిందరావు, ప్రవీణ్‌కుమార్, వై.వి.నాయుడు పాల్గొన్నారు. అనంతరం అదనపు డీజీపీని ఎస్ఎస్ఎస్ హెల్త్‌కేర్ జిమ్ సభ్యులు, జార్జిక్లబ్ సభ్యులు, విద్యార్థులు సత్కరించారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి