Loading...

24, డిసెంబర్ 2012, సోమవారం

పోలీస్‌ సైకిల్‌ యాత్ర ప్రారంభం

విశాఖపట్నం రూరల్, చైతన్యవారధి: పోలీసు వ్యవస్థ ఏర్పడి 150 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖ నుంచి హైదరాబాద్‌ వరకు సైకిల్‌ యాత్ర ప్రారంభమైంది. విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లో ప్రారంభమైన ఈ యాత్రలో అదనపు డీజీపీ రాజీవ్‌ త్రివేది
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణపై ప్రజలతో పాటు పోలీసుల్లోనూ అవగాహన తెచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆయనతో పాటు 20 మంది సభ్యులు యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌ సాంబశివరావు, నగర పోలీస్‌ కమిషనర్‌ శివధర్‌రెడ్డిలు యాత్రను ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి