అందుకే యర్రాపాత్రుడి అరెస్టు: ఏఎస్పీ
నర్సీపట్నం,చైతన్యవారధి: సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళనలు చేసుకోమ్మని రుత్తల యర్రాపాత్రుడు(బాబులు)కు ఎన్నోసార్లు చెప్పామని ఎ.ఎస్.పి. తఫ్సీర్ ఇక్బాల్ చెప్పారు. ఆదివారం ఆయన ఇక్కడి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎ.పి.ఐ.ఐ.సి. అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాల్సిన
సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లకుండా అన్‌రాక్ పరిశ్రమ గేటు ముందు ఆందోళన చేపట్టి ఇతరుల జీవనోపాధిని పొగోడుతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులంతా ప్రతి సోమవారం అందుబాటులో ఉంటున్నారన్నారు. తాము తప్పుడు కేసులు నమోదు చేశామనడంలో వాస్తవం లేదన్నారు. అన్ని ఆధారాలతో ఛార్జిషీటు పెడతామని చెప్పారు. కేవలం యాభై, అరవై మంది యర్రా అనుచరులు జార్ఖాండ్, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని బెదిరిస్తున్నారన్నారు. జనమైత్రీ సంఘాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని వివరించారు. నర్సీపట్నంలో ట్రాఫిక్‌కు నియంత్రణకు కొత్తకోట నుంచి సిబ్బందిని వినియోగిస్తామని చెప్పారు. సమావేశంలో నర్సీపట్నం సి.ఐ. ఎస్.కాంతారావు, కొత్తకోట సి.ఐ. తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి