మోడీదే విజయమని చెబుతున్న సర్వేలు
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. రెండు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనంత భారీఎత్తున పోలింగ్ జరిగింది. గుజరాత్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని భాజపా ఘన విజయంతో వరుసగా మూడోసారి అధికారానికి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. భాజపా పాలనలో ఉన్న
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్కు మొగ్గు ఉందని తెలుస్తోంది. గుజరాత్లో 71.32 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 182 స్థానాలకు గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. గురువారమే దాదాపు ఫలితాలన్నీ వస్తాయి. గుజరాత్లో మోడీ బృందం విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు. ఎంత పెద్ద విజయం సిద్ధించబోతోంది? గెలుపు తర్వాత పార్టీలో మోడీ అధిరోహించబోయే స్థానాలు ఏమిటి? అనే అంశం మీదే చర్చలు జరుగుతున్నాయి. గుజరాత్లో ఈసారి భాజపా, కాంగ్రెస్, కేశూభాయ్ పటేల్ నేతృత్వంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగింది. 1990లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది.
హిమాచల్ ప్రదేశ్లో నవంబరు 4న పోలింగ్ జరిగితే 46 రోజుల విరామం తర్వాత గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక్కడా భారీగా 74.7 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 68 మంది సభ్యుల శాసనసభలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించి అధికారాన్ని చేజిక్కించుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
భాజపాకు 129-141: సీఎన్ఎన్ ఐబీఎన్ నిర్వహించిన పోలింగ్ అనంతర సర్వేలో (ఎగ్జిట్ పోల్స్) గుజరాత్లో భాజపా ఘన విజయాలు నమోదు చేసుకోబోతోందని తేలింది. 182 సీట్లున్న శాసనసభలో భాజపా 48 శాతం ఓట్లతో 129 నుంచి 141 వరకు సీట్లు సాధించుకొనే అవకాశం ఉంది. ఇది 2007 విజయం కన్నా పెద్దది. కాంగ్రెస్కు 36 శాతం ఓట్లు, 37-45 సీట్లు వస్తాయని అంచనా. మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ నేతృత్వంలోని జీపీపీ ఏడు శాతం ఓట్లు తెచ్చుకుంటుందని ఛానెల్ అంచనా వేసింది. 2007 ఎన్నికల్లో భాజపా 117 సీట్లు గెలుచుకుంటే, కాంగ్రెస్ 59 సీట్లకు పరిమితం అయ్యింది. 2007తో పోలిస్తే భాజపా ఒక శాతం, కాంగ్రెస్ రెండు శాతం ఓట్లను నష్ట పోనున్నాయి. ఆ ఓట్లు కొత్త పార్టీ జీపీపీకి బదిలీ అవుతాయని అంచనా. సీఎన్ఎన్ ఐబీఎన్ సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు (46 శాతం మంది) మోడీయే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి