Loading...

16, డిసెంబర్ 2012, ఆదివారం

అప్పన్న ఆలయంలో నేడు నెలగంట

విశాఖపట్నం: ఆలయ సంప్రదాయం ప్రకారం అప్పన్న ఆలయంలో ఆదివారం వేకువ జామున నెలగంట పెట్టనున్నట్టు వైదికవర్గాలు తెలిపాయి. ప్రతియేటా ధనుర్మాసం ప్రారంభం రోజున నెలగంట పెట్టడం ఆనవాయితీ. నెలగంట పెట్టాక గ్రామాలలో సంక్రాంతి పండగ పనులు ప్రారంభించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో
ఆలయంలో తెల్లవారు జామున స్వామికి సుప్రభాత సేవ , ఆరాధన జరుగుతుంది. అనంతరం గంట మోగిస్తారు. గోదాదేవి సన్నిధిలో అమ్మవారికి విన్నపం చేస్తారు. నెలగంట పెట్టినట్టు మైకుల ద్వారా కొండ దిగువన గల గ్రామాలకు సంకేతాలు పంపుతారు.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి