Loading...

28, డిసెంబర్ 2012, శుక్రవారం

నెలాఖరుతో ముగియనున్న ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు

విశాఖపట్నం, డిసెంబరు ౨౭(చైతన్యవారధి): అనధికార లేఅవుట్లు, వాటి పరిధిలోని నివాస స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. విశాఖ మెట్రోపాలిటన్‌ ప్రాంతం (వీఎంఆర్‌) పరిధిలోకి కొత్తగా చేరిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు
గోదావరి జిల్లాల్లో అనుమతులు లేని లే అవుట్లు, పంచాయతీ అనుమతులు మాత్రమే తీసుకున్న వారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని వుడా ఉపాధ్యక్షుడు (వీసీ) కోన శశిధర్‌ తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని అందులో స్పష్టం చేశారు. 2008 డిసెంబరు నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ చేసిన లేఅవుట్లు, నివాస స్థలాల యజమానులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని, వారంతా ఈ నెలాఖరులోగా వుడా కార్యాలయంలో సంప్రదిస్తే అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి