పరవాడ, చైతన్యవారధి: కేంద్ర ప్రభుత్వ సహాయంతో పరవాడ మండల పరిధిలో ప్రవేశపెట్టనున్న వెబ్ ఆధార కంప్యూటర్ సేవలను పరిశీలించేందుకు కేంద్ర బృందం గురువారం విశాఖ రానుంది. ఢిల్లీ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జాతీయ సమాచార కేంద్రం ప్రతినిధులు దుర్గ, సుమిత్, జాన్లతో కూడిన బృందం గురువారం ఉదయం
విమానంలో విశాఖకు వస్తుందని నిక్నెట్ అధికారి వై.వి.కె.ఎస్.ఆర్.మూర్తి తెలిపారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా పరవాడకు వెళతామని, ఆ మండల పరిధిలో ఉన్న 15 పంచాయతీలను ఈ బృందం సందర్శిస్తుందని తెలిపారు. ఆయా పంచాయతీల పరిధిలో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, ఫైబర్ ఆప్టిక్ లైన్లు, ఇతర అంశాలను పరిశీలిస్తారన్నారు. పంచాయతీ కార్యదర్శులతో పరవాడలో సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వెబ్కెమారాలు, కంప్యూటర్ల పనితీరును కేంద్ర బృందం అంచనావేస్తుంది.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి