Loading...

21, డిసెంబర్ 2012, శుక్రవారం

నేటితో యుగియనున్న సహకార సభ్యత్వ నమోదు

విశాఖపట్నం(రూరల్): సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగియనున్నది. దీంతో తమ మద్దతుదారులైన రైతులను సభ్యలుగా చేర్పించడానికి కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ నాయకులు గురువారం సొసైటీ కార్యాలయాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వీలైనంత మంది ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పించడానికి
పోటీ పడ్డారు. జిల్లాలోని విశాఖ సహకార డివిజన్‌లో 44 ఎలమంచలి సహకార డివిజన్‌లో 54 పీఏసీఎస్‌లు వున్నాయి. రెండు డివిజన్లల్లో కలిపి లక్షా68 వేల 072 మంది సభ్యులు వున్నారు. వీరిలో 95,800 మంది విశాఖ డివిజన్, 72,277 మంది ఎలమంచిలి డివిజన్‌లో వున్నారు. సహకార ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.శేషాద్రితో జిల్లా సహకార అధికారి సమావేశమయ్యారు. శుక్రవారం నాటికల్లా ఎన్నికల అధికారుల నియామకం ఖరారు కావచ్చునని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి