150 కోట్ల డాలర్ల ఖర్చు
నాసా మాజీ అధికారుల కసరత్తు
వాషింగ్టన్: 2020 నాటికి 150 కోట్ల డాలర్లతో ఇద్దర్ని చందమామపైకి పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన మాజీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం వారు గోల్డెన్ స్పైక్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. తమ ప్రకటన ఆసియా, ఐరోపా దేశాల్లో ఆసక్తిని కలిగిస్తోందని ఆ సంస్థ తెలిపింది.
ఒక్కో యాత్రకు 150 కోట్ల డాలర్లను టికెట్‌గా నిర్ణయించినట్లు గోల్డెన్ స్పైక్ సీఈవో అలెన్ స్టెర్న్ పేర్కొన్నారు. ఆయన నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్‌కు సంచాలకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సొంతంగా అంతరిక్ష పరిశోధన సంస్థలు లేని దేశాలను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వివరించారు. కొన్ని శాస్త్రీయ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు దీనిపై ఆసక్తి చూపినట్లు చెప్పారు. అయితే వీరు ఇంకా ప్రయోగ రాకెట్‌ను కానీ స్పేస్ క్యాప్స్యూల్‌ను కానీ ఎంపిక చేసుకోలేదు. 2014నాటికి ఈ పనులను పూర్తిచేస్తామని స్టెర్న్ చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న రాకెట్లు, వ్యోమనౌకను ఎంపిక చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అయితే లూనార్ ల్యాండర్, ప్రత్యేక స్పేస్ సూట్లను కంపెనీ సొంతంగా తయారుచేసుకోవాలి. ఇందుకోసం రెండున్నరేళ్లుగా కసరత్తు చేస్తున్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి