Loading...

9, డిసెంబర్ 2012, ఆదివారం

హెచ్‌ఐవీని నిరోధించే లేపనం!

లండన్‌: లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తిచెందే హెచ్‌ఐవీని అడ్డుకొనేందుకు ఉపయోగపడే లేపనాన్ని(జెల్‌)ను పరిశోధకులు కనిపెట్టారు. మహిళల ఉపయోగం కోసం తయారు చేస్తున్న ఈ మైక్రోబెసైడ్‌ జెల్‌.. ఎయిడ్స్‌ వైరస్‌ సంక్రమించకుండా సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ జెల్‌ను పైపూతగా వాడటం ద్వారా
సురక్షితమైన సంయోగం సాధ్యమని వివరించారు. యూరోపియన్‌ కంబైన్డు హైలీ యాక్టివ్‌ యాంటీ-రిట్రోవైరల్‌ మైక్రోబెసైడ్స్‌ కన్సార్టియమ్‌కు చెందిన డెరెడ్రె-బస్‌క్వెట్‌ నేతృత్వంలో శాస్త్రవేత్తలు జెల్‌పై పరిశోధన చేస్తున్నారు. జెల్‌ పనితీరును ఆరు కోతులపై విజయవంతంగా పరీక్షించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అధ్యయనంలోని అంశాలను పీలాస్‌ పాథోజెన్స్‌ జర్నల్‌లో ప్రచురించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి