సికింద్రాబాద్: రైళ్లలో స్లీపర్ క్లాస్‌తో సహా అన్ని రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలనే నిబంధనను ఇక నుంచి మరింత కఠినంగా అమలు చేయనున్నారు. తొలివారంలో కాస్తవెసులుబాటిచ్చినా.. ఈ నెల 8వ తేదీ నుంచి జరిమానాల వడ్డనను ముమ్మరం చేయనున్నారు.
గతంలో కేవలం ఏసీ బోగీల్లో ప్రయాణించే వారిలో ఒకరు మాత్రమే గుర్తింపు కార్డు నిబంధన ఉండేది. దేశవ్యాప్తంగా కొత్త విధానాన్ని రైల్వే శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి తెచ్చింది. ద.మ.రైల్వే పరిధిలో విస్తృత ప్రచారం కల్పించడంతో 95 శాతం వరకూ ప్రయాణికులు గుర్తింపు కార్డులతో ప్రయాణిస్తున్నారు. స్లీపర్ క్లాస్ బోగీల్లో ప్రయాణికుల టికెట్లను సిబ్బంది తనిఖీ చేస్తున్న దశల్లోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లో సగటున 10 నుంచి 50 మందిని మాత్రమే అధీకృత కార్డులు లేని వారుగా గుర్తించారు. వారికి పూర్తి జరిమానాలు విధించనప్పటికీ.. ప్రయాణ ఛార్జీల వ్యత్యాసం వంటి సాధారణ అపరాధ రుసుంతోనే సరిపెట్టారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి