న్యూఢిల్లీ : జంతర్‌మంతర్‌లో తెలంగాణ విద్యార్థుల నిరాహారదీక్షకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త రాష్ట్రాలు చేస్తామని చెప్పారు. లోక్‌పాల్, తెలంగాణ విషయాల్లో కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. అఖిలపక్షం పేరుతో కాలయాపన చేయడమే కాంగ్రెస్ ఎత్తుగడ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము కూడా పాలుపంచుకుంటామన్నారు.
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి