Loading...

17, డిసెంబర్ 2012, సోమవారం

నగరంలో మూడు రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

విశాఖపట్నం, చైతన్యవారధి: ఇందిరమ్మ బాట నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ నెల 17, 18, 19 తేదీల్లో వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్‌ మళ్లిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ శివధర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా
ఉన్నాయి. ఈ నెల 17న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 వరకు. 18న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు 19న సాయంత్రం 3 నుంచి రాత్రి 8 వరకు భారీ వాహనాలను ఈ కింది విధంగా మళ్లిస్తారు.

* అనకాపల్లి నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలను లంకెలపాలెం వద్ద సబ్బవరం, పెందుర్తి మీదుగా ఆనందపురం వైపు మళ్లిస్తారు.
* శ్రీకాకుళం, విజయనగరం నుంచి నగరం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలను ఆనందపురం వద్ద శొంఠ్యాం, పెందుర్తి, సబ్బవరం మీదుగా మళ్లిస్తారు.
* పెందుర్తి మీదుగా నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాలను శొంఠ్యాం మీదుగా ఆనందపురం వైపునకు, ఆనందపురం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను సబ్బవరం వైపునకు పెందుర్తి వద్ద మళ్లిస్తారు.

* శొంఠ్యాం నుంచి అడవివరం మీదుగా నగరంలోనికి ప్రవేశించే అన్ని భారీ వాహనాలను అడవివరం బి.ఆర్‌.టి.ఎస్‌. రోడ్డు మీదుగా హనుమంతవాక వైపునకు మళ్లిస్తారు.
* ఆనందపురం, పెందుర్తి నుంచి శొంఠ్యాం మీదుగా అడవివరం వైపు వచ్చే భారీ వాహనాలను శొంఠ్యాం కూడలి వద్ద పెందుర్తి, ఆనందపురం వైపునకు మళ్లిస్తారు.
* మధురవాడ వైపు నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలను హనుమంతవాక కూడలి వద్ద బి.ఆర్‌.టి.ఎస్‌ రోడ్డు మీదుగా అడవివరం వైపు మళ్లిస్తారు.

* ఉక్కునగరం మీదుగా వచ్చే భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరు.
* షీలానగర్‌ కూడలి నుంచి ఎన్‌.ఎ.డి. వైపునకు వచ్చే అన్ని భారీ వాహనాలను షీలానగర్‌ కూడలి వద్ద పోర్టు రోడ్డు, టోల్‌గేట్‌, మారుతి కూడలి, కాన్వెంట్‌ కూడలి వైపునకు మళ్లిస్తారు.
* నేషనల్‌ హైవే మీదుగా ఎన్‌.ఎ.డి. వైపు వెళ్లే భారీ వాహనాలను తాటిచెట్లపాలెం వద్ద కంచరపాలెం మెట్టు వైపు మళ్లిస్తారు.

* సబ్బవరం నుంచి వేపగుంట మీదుగా నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాలను వేపగుంట కూడలి వద్ద గోశాల, బి.ఆర్‌.టి.ఎస్‌. రోడ్డు మీదుగా హనుమంతవాక వైపునకు మళ్లిస్తారు.
* ఎన్‌.ఎ.డి.కొత్తరోడ్డు కూడలి మీదుగా హైవేలో ప్రయాణించాల్సిన భారీ వాహనాలను ఎన్‌.ఎ.డి.కొత్తరోడ్డు కూడలి వద్ద మర్రిపాలెం, కంచరపాలెం మెట్టు కాన్వెంట్‌ కూడలి వైపునకు మళ్లిస్తారు.
నగరంలో ఇతర వాహనాలను, అవసరానికి అనుగుణంగా నగర కూడళ్లలోమళ్లిస్తారు. వాహనాల మళ్లింపును నగర ప్రజలు గమనించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించవలసినదిగా సీపీ శివధర్‌ రెడ్డి ఆప్రకటనలో కోరారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి