Loading...

9, డిసెంబర్ 2012, ఆదివారం

దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలి

కార్మికశాఖ సంయుక్త కమిషనర్‌ లక్ష్మీనారాయణ
విశాఖపట్నం, చైతన్యవారధి: దుకాణాలు, సంస్థల బోర్డులపై పేర్లు తెలుగులోనే ఉండాలని కార్మికశాఖ సంయుక్త కమిషనర్‌ ఎస్‌.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈనెల 15లోగా ఈ మార్పులు చేయాలన్నారు. ఇప్పటికే దీనిపై వెయ్యిమందికి నోటీసులు జారీ చేయడం
జరిగిందన్నారు. అలాగే ఆయా దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది పట్టిక ఉండాలని, వారందరికీ నియామక ధ్రువపత్రాలు జారీ చేయాలని సూచించారు. బ్యాంకు ద్వారా జీతాలు చెల్లించి, వేతన స్లిప్‌లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈనెల 31లోగా జీవీఎంసీ పరిధిలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలన్నారు. దుకాణాల్లో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్ణీత సమయానికి తెరిచి, మూసివేయాలన్నారు. వీటన్నింటిపై సినిమా థియేటర్లు, టి.వి.ల్లో ప్రకటనలు ఇవ్వాలని కొందరు దుకాణ యజమానులు కోరారు. అయితే ప్రస్తుతం ఆటోల ద్వారా డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని జేసీఎల్‌ పేర్కొన్నారు. నగరంలోని పాత్రికేయులకు బీమా పథకాలు వర్తించే విధంగా గుర్తింపు కార్డులు మంజూరు చేసే ఆలోచనలో కమిషనర్‌ ఉన్నారని తెలిపారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి