పాలకొల్లు(పశ్చిమగోదావరి): ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ రచించిన 'తెలుగు గజలు' పుస్తకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆవిష్కరించారు. స్థానిక ఐఎంఏ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్ తల్లిదండ్రులు కేశిరాజు రత్నావలి, నరసింహరావు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. తొలి ప్రతిని ప్రముఖ
సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అందజేశారు. ఈ పుస్తకాన్ని దివంగత తెలుగు భాషా పండితుడు డాక్టర్ సామల సదాశివకు అంకితమిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్ర పుటల్లో మన సంస్కృతి, భాష ఎంతో గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నారు. వీటి పరిపూర్ణతకు ఎందరో ఆనాటి కవులు రామాయణం, మహాభారతం, శ్రీమత్భాగవతం వంటి ఐతిహాసాలను రచించారన్నారు. నేడు మన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని చెపుతున్నా.. ఇదంతా ఆనాడే విజ్ఞానపరంగా అభివృద్ధి చెందిందని వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ అందరినీ అలరించాయి. మాజీ ఎమ్మెల్యే బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి