Loading...

8, డిసెంబర్ 2012, శనివారం

బాల కార్మికులు కనిపిస్తే ఫోన్‌ చేయండి

వ్యవస్థ నిర్మూలనపై ప్రచారం
విశాఖపట్నం, చైతన్యవారధి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు జాతీయ బాలకార్మిక పథక (ఎన్‌.సి.ఎల్‌.పి.) డైరెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 సంవత్సరాలు
నిండని బాలలను పనిలో పెట్టరాదని, ఇలా చేసిన నేపధ్యంలో వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. భారీ జరిమానాను విధిస్తామన్నారు. ముఖ్యంగా అపార్టుమెంటుల్లో ఇంటి పనికి, దుకాణాల్లో, మెకానిక్‌షెడ్‌ల్లో పని చేసేందుకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారులను ఉపయోగిస్తున్నారని ఇది నేరమని స్పష్టం చేశారు. బడిఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలని, పనిలో ఉండకూడదని వివరించారు. అలానే నగరంలోని అన్ని రైతుబజార్ల పరిసరాల్లో కూడా నిఘా ఉంచుతున్నామన్నారు. బాలకార్మికులను ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నగరంలో బాల కార్మికులను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పిస్తున్నామన్నారు. ఎన్‌.సి.ఎల్‌.పి. పరిధిలో పనిచేస్తున్న బాలకార్మిక పాఠశాలల్లోని వారికి వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే 94907 44199 ఫోన్‌ నెంబరులో తెలియజేయాలని కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి