Loading...

21, డిసెంబర్ 2012, శుక్రవారం

గుజరాత్‌లో మూడో సారి మోడీకి ఓటర్లు పట్టం

అహ్మదాబాద్, డిసెంబర్ 20 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించారు. వరుసగా మూడో సారి మోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 118 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 60 స్థానాలు, జీపీపీ రెండు, ఇతరులు రెండు స్థానాలను గెలుచుకున్నారు. గురువారం
ఉదయం రాష్ట్రంలోని 33 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 1,666 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

మణినగర్ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 85వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో మోడీ విజయం సాధించారు. ఆయన కుడి భుజంగా చెప్పుకునే మాజీ హోంమంత్రి అమిత్ షా నరన్‌పూర్ నియోజకవర్గంలో గెలుపొందారు. మరోవైపు బీజేపీ నుంచి విడిపోయి బీపీపీ పార్టీ స్థాపించిన కేశుభాయ్ పటేల్ విశవదర్‌లో గెలుపొందారు.

తనను గెలిపించి గుజరాత్ ప్రజలు ఉజ్వల భవిష్యత్తుకు మరోసారి పట్టం గట్టారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. విజయం సాధించిన అనంతరం మోడీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి మరోసారి పట్టం గట్టినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ ఉజ్వల భవిష్యత్తుకు తాను కృషి చేస్తానని వాగ్ధానం చేశారు.

నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన మంత్రి అవుతారని మోడీ తల్లి హీరాబెన్ అన్నారు. ఇవాళ ఆమె మోడీ విజయం సాధించిన సందర్భంగా మాట్లాడారు. తన కొడుకు పీఎం అవుతారన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోడీ దేశానికి చేయాల్సింది చాలా ఉంది అని వ్యాఖ్యానించారు. కాగా, మోడీ ప్రధాని కావాలని చాలా మంది కోరుకుంటున్నారని మోడీ సోదరుడు పంకజ్ మోడీ తెలిపారు.

గెలుపొందిన అభ్యర్థులు
* మణినగర్‌లో నరేంద్రమోడి (బీజేపీ) గెలుపు
* 85వేలకు పైగా ఓట్ల మెజారిటీతో మోడీ విజయం
* రాజ్‌కోట్ జిల్లా గోండోల్‌లో జయరామ్ సింగ్(బీజేపీ) గెలుపు.
* నరన్‌పూర్‌లో మాజీ హోంమంత్రి అమిత్ షా(బీజేపీ) గెలుపు.
* మంగ్రోల్‌లో రాజేశ్ భాయ్ (బీజేపీ) గెలుపు.
* సబర్మతిలో అరవింద్ పటేల్(బీజేపీ) గెలుపు.
* నవసారిలో పీయూష్ దేశాయ్(బీజేపీ) గెలుపు.
* గోద్రాలో ప్రవీణ్ సింగ్ చౌహాన్(బీజేపీ) గెలుపు.
* ఆమ్రెల్లిలో పటేల్ భాయ్(కాంగ్రెస్) గెలుపు.
* హిమ్మత్ నగర్‌లో రాజేంద్ర సింగ్‌చౌడా( కాంగ్రెస్) గెలుపు.
* దహోద్‌లో వాజేసింగ్ (కాంగ్రెస్) గెలుపు.
* విశవదర్‌లో కేశుభాయ్ పటేల్(బీపీపీ) గెలుపు. గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. మణి నగర్ నుండి మోడీ ఘన విజయాన్ని సాధించారు. అయితే గత ఎన్నికల కంటే మెజార్టీ తగ్గింది. మోడి 85వేల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెసు తన అభ్యర్థిగా శ్వేతా భట్‌ను బరిలోకి దింపింది. మోడీ విజయంపై కేంద్రమంత్రి చిదంబరం స్పందించారు. గుజరాత్‌లో బిజెపి గెలిచినప్పటికీ కాంగ్రెసు గెలిచినట్లే లెక్క అన్నారు. మోడీ ప్రభావాన్ని తాము సమర్థవంతంగా అడ్డుకోగలిగామన్నారు. మరోసారి గుజరాత్ ప్రజలు మంచి భవిష్యత్తుకు పట్టం కట్టారని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. గుజరాత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జామ్ నగర్ రూరల్ ప్రాంతంలో నుండి పోటీ చేస్తున్నారు. అతను వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రాఘవ్ జీ పటేల్ ముందంజలో ఉన్నారు. పోరుబందర్ నుండి పోటీ చేస్తున్న పిసిసి అధ్యక్షుడు కూడా ఓటమి బాటలో ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి