Loading...

6, డిసెంబర్ 2012, గురువారం

టమాటాతో కుంగుబాటు దూరం!

లండన్‌: టమాటాలు కుంగుబాటును దూరం చేస్తాయని చైనా, జపాన్‌ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వారంలో రెండు నుంచి ఆరుపర్యాయాలు టమాటాలు తీసుకున్న వారిలో కుంగుబాటు ఛాయలు తగ్గినట్లు తేలింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి వైద్యరికార్డులను...
వారి ఆహారపుటలవాట్లను నిశితంగా పరిశీలించినపుడు ఈ విషయం వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతిరోజూ టమాటాలు తీసుకున్న వారిలో కుంగుబాటు సమస్య 52శాతం తగ్గినట్లు తేలింది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, గుండెపోటు తదితర ఆనారోగ్యాలనుంచి కాపాడే యాంటీఆక్సిడెంట్లు టమాటాలో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా టమాటాల్లో సమృద్ధిగా ఉండే లైకోపీన్‌ మానసిక ఆరోగ్యానికి కూడా సంజీవనిలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి