విశాఖపట్నం, చైతన్యవారధి: పెదవాల్తేరులోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రిలో వసతుల మెరుగుకు కృషి చేస్తామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ విష్ణుప్రసాద్ అన్నారు. సుమారు రూ.25 లక్షలతో ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఆరోగ్యశ్రీ వార్డును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎన్టీ, మెంటల్ కేర్, శ్వాశకోస ఆసుపత్రులకు సంబంధించి కొన్ని పరికరాలు ఉమ్మడిగా వాడుకోవాలని సూచించారు.
ఎం.ఆర్.ఐ, సీటీ స్కాన్ లాంటి అధునాతన పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇక్కడ అంబులెన్సు లేదని ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ కృష్ణకిశోర్ డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఔట్సోరింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి సకాంలో జీతాలు చెల్లించలేకపోతున్నామని చెప్పారు. శ్వాశకోస ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.సుబ్బారావు, డాక్టర్ రఘునాథ్‌బాబు పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి