Loading...

20, డిసెంబర్ 2012, గురువారం

తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు

వారంలో ఒకరోజు సంపద్రాయ దుస్తుల్లో విధులకు..
జిల్లా పరిషత్‌ ఉద్యోగుల తీర్మానం
చిత్తూరుజిల్లా: తెలుగు సంప్రదాయలు కాపాడేందుకు చిత్తూరు జిల్లా పరిషత్‌ ఉద్యోగులు బుధవారం సమావేశమైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. కార్యాలయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండేవిధంగా
తీర్మానించారు. సమాచారం తెలుగులోనే టైప్‌ చేసేలా ఉద్యోగులు శిక్షణ తీసుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు తెలుగు సంప్రదాయాన్ని కాపాడడానికి ప్రతినెలా తొలి శనివారం విధిగా పంచెకట్టు, కండువాతో విధులకు హాజరుకావాలనే షరతును విధించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి, శంకరంబాడి సుందరాచారి చిత్రపటాలను జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి