లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న భూ తాపం సమస్యకు అమెరికా శాస్త్రవేత్త డేవిడ్ కీత్ సత్వర పరిష్కార మార్గాన్ని సూచించారు. భూమి మీద పడే సూర్యకాంతిని 0.5 శాతం మేర తగ్గించడం ద్వారా ఆర్కిటిక్‌లో మంచుకరగకుండా చూడొచ్చన్నారు. వాతావరణంలోకి పరావర్తన అణువులను పంపించడం ద్వారా భూమిని తాకే సూర్యకాంతిని
తగ్గించొచ్చని కీత్ పేర్కొన్నారు. దీనివల్ల ఆర్కిటిక్‌లో మళ్లీ హిమీకరణ జరుగుతుందని.. పారిశ్రామికీకరణకు ముందునాటి పరిస్థితులను తీసుకురావచ్చని తెలిపారు. తన ప్రతిపాదన అమలుకు ఏటా రూ.40 వేల కోట్లు ఖర్చవుతాయని వెల్లడించారు.

వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి